ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ అదేసముల మేరకు ఈ రోజు జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థ ఆధ్వర్యములో స్థానిక స్వదార్ గృహం(విభిన్న
సమస్యల బాధిత మహిళల పునరావాస కేంద్రం), మహిళా ప్రాంగణం, మహిళలకు “హెచ్.ఐ.వి
పరీక్షలు మరియు హెచ్ ఐ వి/ఎయిడ్స్ పై అవగాహనా
కార్యక్రమము” నిర్వహించడమైనది.
ఈ కార్యక్రమముకు శ్రీ. కే. నీలిమ గారు, జిల్లా మేనేజర్, యెన్.టి.అర్ నైపుణ్య
అభివృద్ధి మరియు మహిళా సాధికర కేంద్రం, మహిళా ప్రాంగణం, ముక్య అతిదిగా
పాల్గొన్నారు శ్రీ. కే. నీలిమ గారు
మట్లాడుతూ హెచ్ ఐ వి వ్యాధి నివారణలో యువత చురుకుగా పాల్గొనాలని, హెచ్ ఐ వి/ఎయిడ్స్ పై అవగాహనా
కలిగివుండటమే కాకుండా పది మందికిఅవగాహనా కల్పించాలని కోరారు.
ఈ కార్యక్రములో మహిళ ప్రాంగణం లో నిర్వహిస్తున్న స్వదార్ గృహం లో వున్నా
మహిళలు అందరకు హెచ్.ఐ.వి పరీక్షలు నిర్వహించాదమైనది అనంతరము పి బాలాజీ, జిల్లా ప్రోగ్రాం మేనేజర్, జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థ, ప్రసంగించారు ఈ సందర్బముగా అయన మాట్లాడుతూ సమాజములో ఆడవారు హెచ్.ఐ.వి గురించి అవగాహనా
కలిగివుండాలని, స్త్రీలు నిస్సహాయ స్టితి లో హెచ్.ఐ.వి కి గురి అవుతున్నారని,
స్త్రీలు హెచ్.ఐ.వి/ఎయిడ్స్ గురించి దైర్యముగా మాట్లాడాలని తెలియజేసారు. హెచ్ ఐ వి/ఎయిడ్స్ ఎలావ్యాపిస్తుంది
మరియు హెచ్ ఐ వి సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలని తెలియజేసారు. సూదులు సిరంజిలు, రక్త మార్పిడి మరియు తల్లి నుండి బిడ్డకు హెచ్ ఐ వి సోకకుండా
రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ
సంస్థ తగు జాగ్రత్తలు తీసుకుంటుందని, సురక్షితము
కాని శృంగారము కారణమూగా ఈ వ్యాధి ఎక్కువవగా సోకుతుందని తెలియజేసారు. యువత మంచి భవిష్యత్తుని హెచ్ ఐ వి బారిన
పదనివ్వద్దని. పెళ్ళికి ముందు హెచ్ ఐ వి పరీక్షా
చేయించు కోవటము పై విస్తృత
చర్చ జరగాలని, పెళ్ళికి ముందు హెచ్ ఐ వి పరిక్ష అవసరము గుర్తించాలని,జిల్లలో కొంత మంది
స్త్రీలు చిన్న వయస్సులో భర్తను హెచ్ ఐ వి వ్యాధి
కారణముగా కోల్పోయీ చాలా ఇబ్బందులు పడుతున్నారని దీనికి పరిష్కారము పెళ్ళికి
ముందు హెచ్ ఐ వి పరీక్షా అని చెప్పారు. నిర్లక్ష్య ప్రవర్తనతో జీవిస్తే ఎవ్వరైనా హెచ్ ఐ వి భారిన పడే
అవకాసం వుందని.
హెచ్.ఐ.వి పరీక్షలు శ్రీ. దేముదమ్మ ఏ.యెన్.ఏం మరియు శ్రీ. నాయుడు, ప్రోగ్రాం
మేనేజర్, అర్.ఈ.ఎస్ సంస్థ నిర్వహించారు. ఈ కార్యక్రమములో శ్రీ. పి. బాలాజీ, జిల్లా
ప్రోగ్రాం మేనేజర్, శ్రీ. కే. నీలిమ గారు, జిల్లా
మేనేజర్, యెన్.టి.అర్ నైపుణ్య అభివృద్ధి మరియు మహిళా సాధికర కేంద్రం, మహిళా
ప్రాంగణం, శ్రీ. నాయుడు, ప్రోగ్రాం మేనేజర్, అర్.ఈ.ఎస్, శ్రీ. దేముదమ్మ ఏ.యెన్.ఏం
మరియు శ్రీ.దమయంతి పాల్గొన్నారు.
No comments:
Post a Comment