Tuesday, November 6, 2018

ఆశలకు మరియు ఎ ఎన్ ఎం లకు హెచ్.ఐ.వి/ఎయిడ్స్ పై అవగాహన

ఈ రోజు ఆశ డే సందర్బముగా రాకోడు ప్రాధమిక ఆరోగ్య కేంద్రములో సమావేశమైన ఆశలకు మరియు ఎ ఎన్ ఎం లకు హెచ్.ఐ.వి/ఎయిడ్స్ కార్యక్రమము పై మరియు ఆశ/ఎ.ఎన్.ఎం ల పాత్ర గురుంచి అవగాహనా కల్పించారు. ఈ సందర్బముగా పి. బాలాజీ. జిల్లా ప్రోగ్రమ్ మేనేజర్ మాట్లాడారు హెచ్ ఐ వి/ఎయిడ్స్ ఎలా వ్యాపిస్తుంది మరియు హెచ్ ఐ వి సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలని  తెలియజేసారు.  సూదులు సిరంజిలురక్త మార్పిడి మరియు తల్లి నుండి బిడ్డకు హెచ్ ఐ వి సోకకుండా రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ తగు జాగ్రత్తలు తీసుకుంటుందని,   సురక్షితము కాని శృంగారము కారణమూగా ఈ వ్యాధి ఎక్కువవగా సోకుతుందని తెలియజేసారు. 

తల్లి నుండి బిడ్డకు హెచ్.ఐ.వి సోకకుండా చేసే కార్యక్రమములో ఆశ/ఎ.ఎన్.ఎం ల పాత్ర చాల ముక్యమని మరియు వారు 12 వరములకే గర్బిని స్త్రీని గుర్తించి హెచ్.ఐ.వి పరీక్షలు నిర్వహించాలని. హెచ్.ఐ.వి గుర్తించడం అలస్యంయ్యేకొద్ది  తల్లి నుండి బిడ్డకు హెచ్.ఐ.వి సోకే అవకాశాలు పెరిగిపోతాయని తెలియజేసారు.  ఈ కార్యక్రమములో శ్రీ. నాయుడు, ప్రాజెక్ట్ మేనేజర్, అర్.ఈ.ఎస్. టి.ఐ. ప్రోగ్రమ్ మరియు పి.హెచ్.సి సిబ్బంది పాల్గొన్నారు.


No comments:

Post a Comment